Pages

Wednesday, September 28, 2011

Gundamma Katha(1962) Telugu Lyrics!

0 comments


Songs Name: Sannaga Veeche
Singer:Susheela
Lyrics:pingali
Compose:Ghantasala


Download Sannga Veeche Telugu Lyrics Here:


సన్నగ వీచే చల్ల గాలికి కనులు మూసిన కలలాయే
తెల్లని వెన్నెల పానుపు పై ఆ కలలో వింతలు కననాయే
అవి తలచిన ఏమో సిగ్గాయే
కనులు తెరచిన నీవయే నే కనులు మూసిన నీవయే


నిదురించిన నా హ్రుదయమునెవరో కదిలించిన సడి విననాయే
కలవరపడి నే కనులు తెరువగా కంటి పాపలో నీవాయే
ఎచట చూసినా నీవాయే


మేలుకొనిన నా మదిలో యేవొ మెల్లని పిలుపులు విననాయే


ఉలికిపాటుతో కలయ వెతక నా హృదయ ఫలకమున నీవాయే
కనులు తెరచినా నీవాయే


కనులు మూసినా నీవేనాయే




2.Songs Name : Prema Yatralaku
   Singer:ghantasala
   Lyrics:Pingali
   Composer:Ghantasala



ప్రేమయాత్రలకు బౄందావనము నందనవనము యేలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనొ
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము యేలనో


చెలి నగుమోమె చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతొ జగమునె ఊత్య్ సాయగా
ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలూ యేలనో
కన్నవారినే మరువజేయుచూ అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ యేలనో
అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బౄందావనము నందనవనము యేలనో


Song3.Aligina velane Choodali
Lyrics:Pingali
Singer:



అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్నుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుసరుసలాడే చూపులలోనె ముసి ముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి


అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జలు ఘల్లన
తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరి ఏమని అడిగినందుకే


మోహన మురళి గానము వినగా తహ తహ లాడుచు తరుణులు రాగా
దౄష్టి తగులునని జడిసి యశోద తనను చాటుగా దాచినందుకే





Song4:Kolo KoloYanna
Singer:P.Susheela,Ghantasala
Lyrics:Pingali





కోలుకోలోయన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మాంచి జోడు
మేలుమేలొయన్న మేలో నారంగ కొమ్మలకు వచ్చింది ఈడు
ఈ ముద్దుగుమ్మలకు చూడాలి జోడు


బాలబాలోయన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాలా
బేలబేలోయన్న బేలో పెద్దమ్మి చిలకలా కులికేను చాలా
బేలబేలోయన్న దిద్ధినక ధిన దిద్ధినక ధిన దిద్ధినక ధిన ధిం
బేలబేలోయన్న బేలో పెద్దమ్మి చిలకలా కులికేను చాలా
ఈ బేల పలికితె ముత్యాలు రాలబాలబాలోయన్న బాలో చిన్నమ్మి అందాల గారాల బాలా
బేలబేలోయన్న బేలో పెద్దమ్మి చిలకలా కులికేను చాలా
బేలబేలోయన్న దిద్ధినక ధిన దిద్ధినక ధిన దిద్ధినక ధిన ధిం
బేలబేలోయన్న బేలో పెద్దమ్మి చిలకలా కులికేను చాలా
ఈ బేల పలికితె ముత్యాలు రాల


ముక్కుపైనుంటాది కోపం చిట్టెమ్మ మనసేమొ మంచీదె పాపం
ఇంతికి వెలుగైన దీపం బుల్లెమ్మ కంట చూసిన పొవు తాపం
జంటుంటె ఎందురానీదు యే లోపం


Song5:Lechindi Nidra Lechindi
Singer:Ghantasala
Lyrics:Pingali





లేఎచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది మహిళాలోకం
ఎపుడొ చెప్పెను వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కూడా
లేఎచింది నిద్ర లేచింది మహిళాలోకం
పల్లెటూళ్ళలొ పంచాయితీలు పట్టణాలలొ ఉద్యోగాలు
అది ఇది ఏమని అన్ని రంగములా
అది ఇది ఏమని అన్ని రంగముల
మగధీరుల నెదిరించారు నిరుద్యొగులను పెంచారూ
లేఎచింది నిద్ర లేచింది మహిళాలోకం
చట్టసభలలొ సేత్ల కోసం భర్తలతోనే పోటీ చేసీ
దెళి సభలో పీఠం వేసీ
దెళి సభలో పీఠం వేసీ
లెచ్తురెలెన్నో దంచారు
విడాకు చట్టం తెచ్చారూ












Song6:Veshamu Marenu
Singer:Ghantasala,P.Susheela
Lyrics:Pingali



వేషము మార్చెనూ భాషను మార్చెనూ
మోసము నేర్చెనూ అసలు తానే మారెనూ
అయినా మనిషి మారలేదూ
ఆతని మమత తీరలేదు


కృఊరమృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయముపై జెండా పాతెను
ఆకాశంలొ షికారు చేసెను
అయినా మనిషి మారలేదూ
ఆతని కాంక్ష తీరలేదు


పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను వాదము చేసెను
త్యాగమె మేలని బోధలు చేసెను
ఐనా మనిషి మారలేదూ
ఆతని బాధ తీరలేదు
వేషము మార్చెను
భాషను మార్చెను
మోసము నేర్చెను
తలలే మార్చెను
ఐనా మనిషి మారలేదూ
ఆతని మమత తీరలేదు



Song7:Entha Hai Ee Rei
Singer:Ghantasala
Lyrics:Pingali


ఎంత హాయి ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా
చందమామ చల్లగా పన్నీటిజల్లు చల్లగా

ఒకరి చూపులొకరిపైన విరిటూపులు విసరగా
ఒకరి చూపులొకరిపైన విరితావులు వీచగా
విరితావుల పరవడిలొ విరహమతిసయింపగా
విరితావుల ఘుమఘుమలొ మేను పరవశింపగా

కానరాని కొయిలలు మనల మెలుకొలుపగా
కానరాని కొయిలలు మనకు జోలపాడగా
మధురభావలాహిరిలొ మనము తూలిపోవగా
మధురభావలాహరిలొ మనము తేలిపోవగా
ఎంత హాయి ఈరేయి ఎంత మధురమీ హాయి
చందమామ చల్లగా మత్తుమందు చల్లగా




Comments

0 comments to "Gundamma Katha(1962) Telugu Lyrics!"

Post a Comment

 

Copyright 2008 All Rights Reserved Revolution Two Church theme by Brian Gardner Converted into Blogger Template by Bloganol dot com